ప్రేమ లేకుండా ఇంతవరకు నాకు తెలిసి ఏ సినిమా రాలేదు... ఎటువంటి జనర్ లో నైనా ఇంతవరకు ప్రేమ లేకుండా రాలేదు....
పిచ్చి ప్రేమ పిచ్చి ప్రేమ పిచ్చి ప్రేమ
పిచ్చి ప్రేమ అనే షార్ట్ ఫిల్మ్ కి టైటిలే ఎందుకు అలా పెట్టరో అనుకున్న. (ఎందుకంటే ఈ మధ్య అందరూ కెమెరా కొంటున్నారు ఏదో ఒక్కటి తీస్తున్నారు పిచ్చి పిచ్చి టైటిల్స్ పెడుతున్నారు.) ఫస్ట్ చూడవద్దు అనుకున్న కానీ ఏ పుట్ట లో ఏ పాము ఉందో తెలియదన్నట్టు క్లిక్ చేశా. అబ్బా 28 నిమిషాలా అనుకున్న ప్లే అవుతుంది....ఎందో పిచ్చి పిచ్చి సౌండ్స్ వస్తున్నాయి... పిచ్చి ప్రేమ కదా! అంతే అనుకుంటా అని అనుకున్న... తరువాత ప్రేమిస్తే సినిమాలో హీరో నెత్తి మీద కొట్టుకున్నట్టు కొట్టుకుంటూ పిచ్చి పిచ్చి గా అరుస్తూ ఒక్కడు రోడ్ల మీద పడి తిరుగుతుంటాడు.
కొంచం కెమెరా వర్క్ బాగుండడం వల్ల క్లోజ్ చేయలేక పోయా, కొంచం నేపధ్య సంగీతం కూడా బాగుంది... చూస్తూ ఉంది పోయా... ఏదో జరుగుతుంది ఇద్దరు పిచ్చి వాళ్ళు, వాళ్ళ అరుపులతో, వాళ్ళ చెస్టలతో, నన్ను అలాగే క్లోజ్ చేయనీయకుండ చేశారు. హార్డ్ వర్క్ మాత్రం చాలా చేశారు, పిచ్చి వాళ్ళు ఎలాగ ఉంటారో వీళ్ళు అలాగే చేశారు. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది.
అలా రోడ్ల మీద తిరుగుతూ రాత్రి అయే సరికి ఇద్దరు అనుకోకుండా ఒక్క ప్లేస్ లో నే కలుస్తారు. అందులో ఒక్కడు అన్నం తింటూ వాడిని చూసి వాడికి కూడా పెడతాడు అలా పెట్టగానే. వాడికి వాళ్ళ అమ్మ గుర్తుకు వస్తుంది. అయితే అన్నం మొత్తం నువ్వే తిను. అని అన్నం పెట్టిన వాడు పండుకొని మధ్య రాత్రి లో ములుగుతూ ఉంటాడు. అన్నం తిన్నవాడు వాడిని చూసి బయపడి, కాళ్ళు వొత్తుతు ఉంటాడు అంతలో అతనికి డాడీ గుర్తుకు వస్తాడు. ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఫ్లాష్ బాక్ చెప్పుకుంటారు. పెంచుకున్న తల్లితండ్రులు చనిపోయాన తరువాత పిచ్చి వాడిలాగా తయారయను అని ఒక్కడు అంటాడు. నా కన్నాతల్లి నన్ను కస్ట పడి పెంచి చదివించి నన్ను గొప్ప ప్రయజోకుడిని చేసి తను చనిపోయింది. ఇద్దరి యొక్క తల్లి తండ్రులు చనిపోవడం వల్ల పిచ్చి వాళ్ళుగా మారుతారు. పిచ్చి నుంచి మామూలు మనషులు అవుతారు. నాకు ఎవ్వరూ లేరు నేను చనిపోతాను అని ఒక్కడు అంటే, లేదు నేను ఉన్న నా కోసం బ్రతుకు అని ఒక్కడు అంటాడు..
సాంగ్ స్టార్ట్ అవుతుంది...
సూరీడు, చంద్రుడు గగనం లో ... రవి గాడు శీను గాడు భువనం లో....
మధ్యలో కామడి కోసం అని సచిన్ లాగా యాక్ట్ చేస్తారు...
తరువాత చేజే..
ఇద్దరు మిస్ అవుతారు... శీను గాడు రవి గాడ్ని వెతుకుతూ ఉంటాడు...శీను గాడు దోరకడు..
లాస్ట్ కి దొరుకుతాడు.. శీను గాడు చనిపోతాడు...
మళ్ళీ రవికి పిచ్చి పట్టుది
హైలెట్స్ : యాక్టింగ్, నేపద్య సంగీతం, డైరక్షన్, కెమెరా వర్క్
మైనేస్స్ : స్టార్టింగ్ లో రవి, శీను లు ఎండింగ్ లో వచె సరికి రవి, శీను అవుతాడు.. శీను రవి అవుతాడు.. నేమ్స్ విష్యంలో,
కథ ఒక్ కానీ అంతా గొప్ప గా లేదు. మాటలు బాగున్నాయి... ఏదో చెప్పాలి అని ఏదో చెప్పారు అనుకుంటున్నాను... ఓవరాల్ గా బాగుంది...
శ్రీ కృష్ణ దేవరాయ నీకు అల్ ద బెస్ట్..
Rating : 4 out of 5
Short film path : http://www.youtube.com/watch?v=6NiSNIBZf3w&feature=share&noredirect=1
www.facebook.com/VangClicks
!! SHARE if you LIKE!!
No comments:
Post a Comment